Wel-Come to Our Blogger

Freely you have Recieved, Freely Give - Matthew 10:8

The prayer of the upright is His delight. - Proverbs 15:8 | యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. - సామెతలు 15:8

కీర్తన 25:9

By G Sunil Kumar - Saturday, 9 August 2014 No Comments
న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును. - కీర్తనలు 25:9

మన దేవుడు సజీవమైన దేవుడు, మన పక్షమున ఆయన పనిచేయును, దేవుని చిత్తముతో కూడిన జ్ఞానమును బలమైన, సజీవమైన విశ్వాసమును మనకు అనుగ్రహించును.

నేను టోక్యోలో ఉన్నప్పుడు అక్కడ నుండి ఫిలిప్పైన్ ద్వీపములకు వెళ్లవలెనని సిద్ధపడుచుంటిని. కానీ ఇంకా వీసా రావలసియున్నది. కావున నేను ఉత్తర జపాన్ లోని ఒక ప్రదేశమునకు కూడా వెళ్లవలెనని సిద్ధపడుచున్నందున ఆ సమయములో అక్కడకు వెళ్ళుట ఎంతో కష్టతరమైనది. కనుక ఉత్తర జపాన్ వెళ్ళుట మానివేయవలెనా లేదా ఫిలిప్పైన్ ద్వీపమునకు వెళ్ళుటకు వీసా ప్రయత్నమ మానివేయవలెనా అని ఆలోచించుకొనుచూ ప్రార్ధించగా దేవుడు నన్ను ఉత్తర జపాన్ కు వెళ్లుమని, వీసా కూడా వచ్చునని ఎంతో స్పష్టముగా నాతో చెప్పియున్నాడు. ఆ సమయములో మెట్ల క్రిందికి వెళ్లుము అను స్వరము వింటిని. క్రిందికి వెళ్ళుటకు నాకు సరియైన కారణము లేకపోయినప్పటికీ నేను ఆ స్వరమునకు లోబడి క్రిందకు వెళ్లి, ఒక మూల ఉంటిని. అక్కడ ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళుటకు సామాన్లు సర్దుకొనుట చూచితిని. అతని దగ్గరకు వెళ్లి వీసా కొరకు మీ దగ్గర దరఖాస్తు ఏమైనా ఉన్నదా అని అతనిని అడిగితిని. అతడు నాకు ఒక దరఖాస్తు ఇచ్చెను. ఆ తరువాత వీసా పొందగల ఆఫీసుకు నన్ను తీసికొని వెళ్లగలడేమోనని అతనిని అడుగగా, సంతోషముగా తీసికొని వెళ్ళగలను అని చెప్పెను. ఆ సమయములో ఆ స్వరమునకు లోబడి నేను క్రిందకు వెళ్ళని యెడల దానిని నేను పొందలేకపోయెడివాడను. నేను వీసా ఆఫీసుకు టాక్సీ లో వెళ్లితిని. కానీ టాక్సీ కి చెల్లించుటకు నా దగ్గర జపాన్ ద్రవ్యము లేదు. నేను అమెరికా ద్రవ్యమును మాత్రమే కలిగి యుంటిని. కానీ ఆ దినమున దేవుడు నన్ను ఆ వీసా ఆఫీసుకు వెళ్లుమని చెప్పియున్నాడని ఎరిగియుండుట వలన నా విశ్వాసము నాకు ధైర్యమును ఇచ్చినది. నేను ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లగా అతనిది కూడా అదే దారి గనుక తనను కూడా మీ టాక్సీలో తీసికొని వెళ్లగలరా అని నన్ను అడిగెను. వెంటనే నేను ఒప్పుకొంటిని. టాక్సీలో దేవుని గూర్చి నేను అతనితో మాట్లాడి, నా సాక్ష్యము పంచుకొంటిని. మేము టాక్సీ దిగినప్పుడు టాక్సీకి తానే బలవంతముగా డబ్బు చెల్లించెను. ఈ రీతిగా దేవుడు నా అవసరములన్నింటిని తీర్చుటకు పూనుకొనెను. ఆయన సన్నిధిలో నీవు దేవుని కొరకు వేచియున్న యెడల ఆయనే నిన్ను తన పరిపూర్ణ మార్గములో నడిపించును.

Tags:

No Comment to " కీర్తన 25:9 "