విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు.. - హెబ్రీ. 12:2
సృష్టి ఆరంభము నుండి మానవుడు అన్నియు స్వతంత్రిచుకొనవలెననునది దేవుని కోరికయై యున్నది. ఆయన మొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు అతనికి శక్తిని, అధికారమును, ఆధిపత్యమును ఇచ్చెను. ఆదాము అవిధేయతను బట్టి ఆ ఆధిక్యత ను పోగొట్టు కొనెను. ఆ నష్టము మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పూర్తిగా మానవునికి తిరిగి సమకూర్చబడినది మరియు సాతానును సిగ్గుపరచు నిమిత్తము, ఆదాము ఏదైతే కోల్పోయెనో అంతకంటే మరి ఎక్కువ మనము పొందబోవుచున్నాము. నీలో నిత్య జీవము సమృద్ధిగా, స్వేచ్ఛగా ప్రవహించ నారంభించినప్పుడు ఈ మర్మమును నీవు తెలిసికొనగలవు.
1 కొరింతి 2:9 లో మనకు ఇట్లు జ్ఞాపకము చేయబడుచున్నది. "దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు". ఈ సంగతులను మానవ జ్ఞానముతోగాని, మానవ ఆలోచనతోగాని, బైబిలు జ్ఞానముతో గాని మనము అర్థము చేసికొనలేము. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ అంతకంతకు వృద్ధియగుచున్నదని నీవు తెలిసికొనెదవో అప్పుడు మాత్రమే ఈ సంగతులు నీకు అర్ధమగును. దేవుని బిడ్డల ఆత్మీయ స్వాస్థ్యమును దొంగిలించవలెనని సాతాను ఎప్పుడును ప్రయత్నించుచుండును. అందుచేతనే మనము జాగురూకులమై యుండి, దేవుడు మనకు ఇచ్చిన దానిని ఎంతో జాగ్రత్త కలిగి గట్టిగా పట్టుకొనవలెను. మార్కు 13:37 లో "నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండుడనెను." మెలకువగా నుండుడి మరియు మీ ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన స్వాస్థ్యమును మీ యొద్ద నుండి శత్రవును దొంగిలింపనియ్యకుడి. శత్రువు నీ యొద్దనుండి నిత్యజీవ వరమును తీసివేయలేడు. కానీ నీవు నీ ఆత్మీయ స్వాస్థ్యమును అనుభవించకుండా చేయుటకు వానికి శక్తి కలదు. తరచుగా మనపై శత్రువు ఆత్మీయ అంధకారము మరియు ఆత్మీయ గ్రుడ్డితనము అను ఆయుధములను ఉపయోగించును. ఇవి ఎంతో బలమైన ఆయుధములు. శత్రువు వీటిని ఆ అంత్యదినములలో ఉపయోగించు వాడుగా ఉన్నాడు. మనము వేటి నుండి విడుదల పొందవలసిన వారమైయున్నామో వాటిని అనగా అన్ని రకములైన ఆచారములను, ఉత్సవములను, సంప్రదాయములను శత్రువు మన జీవితములోనికి తీసికొని వచ్చును. రోమా 8:14 లో అపొస్తలుడైన పౌలు ఈలాగున చెప్పుచున్నాడు, "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై యుందురు". ప్రభువైన యేసుక్రీస్తులో మన రక్షణ విషయమై స్పష్టమైన అవగాహన కలిగియుండవలెను. మనలను మనము ఎల్లప్పుడును ఆయన శిరస్సత్వము, ప్రభుత్వము, రాజరికం క్రింద ఉంచుకొనవలెను. ప్రతి క్షణము ఆయనచే ఏలబడవలెను, స్వాధీన పరచబడ వలెను. యోహాను 15:5 లో ప్రభువు, "ఎవడు నా యందు నిలచియుండునో నేను ఎవని యందు నిలచియుండునో వాడు బహుగా ఫలించును"అని చెప్పుచున్నాడు.
నేను మార్పు చెందిన తరువాత నా హృదయములో వాక్యము కొరకైన గొప్ప ఆకలిని కనుగొంటిని మరియు ఆ దినములలో అనేక గంటలు నేను మోకాళ్లపై దేవునితో సమయము గడిపితిని. ఏ విధమైన కష్టము లేకుండగానే దేవుని నన్ను ఈ లోక సుఖముల నుండి, ఆకర్షణల నుండి విడిపించెను. కానీ నా ఆత్మీయ జీవితములో ఇంకా ఏదో కొరత ఉన్నదని గమనించితిని. కనుక "దేవా సంపూర్ణమైన ఆత్మీయ జీవితము నిమ్ము" అని రహస్యముగా ప్రార్ధించుట మొదలు పెట్టితిని. ఆలాగున నేను అనేక మాసములు ప్రార్ధించగా ఒక రాత్రి దేవుని స్వరమును ఈలాగున వింటిని, "నీ పాపములన్నియు ఎట్లు క్షమించబడెనో నాకు చెప్పుము." అప్పుడు "దేవా, నేను ఘోరమైన పాపిని నమ్ముచున్నాను. నా పాపముల కొరకై నీవు రక్తము కార్చి , ఆ రక్తము ద్వారా నన్ను క్షమించితివి" అని చెప్పితిని. తరువాత అదే స్వరము "నీవు జీవించుచున్న వారిలో అతి బలహీనుడవు అని నమ్ముము, అప్పుడు నీవు నా శక్తిని కలిగియుందువు" అని చెప్పుట వింటిని. ఈ మాటలే నా అనుభవమైనవి. దేవుడు ఇట్లు చెప్పెను. "నాకు వేరుగా (నేను లేకుండా) మీరు ఏమియు చేయలేరు". అప్పుడు ప్రతిదానిని, మాట్లాడు ప్రతి మాట విషయములో, ప్రతి ఆలోచనకు, చేయవలసిన ప్రతి ప్రణాళిక కొరకు దేవునిపై సంపూర్ణముగా నేను ఏ రీతిగా ఆనుకొనవలెనో తెలిసికొనియున్నాను. ప్రతి చిన్నదానికి కూడా ఆయన దగ్గరకు వెళ్ళవలసినదే. అప్పుడు ఆయన శక్తిమంతుడని, ఆ శక్తి నా కొరకేనని తెలిసికొనియున్నాను. మనము మన దృష్టిని ఎల్లప్పుడూ, హెచ్చించబడిన, మహిమకరమైన, ప్రేమ గల రక్షకుని పై ఉంచుకొని వలసియున్నది. మన జయజీవితము దానిపై మాత్రమే ఆధారపడి యున్నది. బైబిలు జ్ఞానముపై గాని, దీర్ఘ ప్రార్ధనలపై గాని, ఉపవాసములపై గాని, ఇతర అర్హతలపై గాని కాదు. మన ప్రభువు మనకు వాస్తవమైన వాడుగా ఉన్నప్పుడు మన ప్రతి విషయములో ఆయన బాధ్యత వహించును.

No Comment to " హెబ్రీయులకు 12:2 "