దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు - అపో.కార్యములు 20:28
విశ్వాసులు భద్రపరచబడునట్లు అపొస్తలుడైన పౌలు పెద్దలకు గంభీరమైన హెచ్చరికలు చేసెను. అతడు ఈ విధముగా చెప్పెను, "దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియును. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు" (అపో. కా 20:28-30) . సాతాను ఎంతో పని కలిగియుండును. దేవుని ప్రజలు అబద్ధ బోధకుల ద్వారా (అనగా వారిని తోడేళ్ళు అని సంబోధించెను) మోసపరచబడెదరు. అందుచే పరిశుద్ధాత్మ వారిని విచారణ కర్తలుగా ఉంచెను. అపొస్తలుడైన పౌలు ఎఫెసులో 3 సంవత్సరములు ఉండి వారికి బోధించుచు, ఎంతో శ్రద్ధతో మరియు కన్నీళ్లతో ఈ పెద్దలు దేవునిచేత ఏర్పరచబడిన పనివారని బోధించెను.
చివరి దినములలో జీవించుచున్న మనము దేవుని వాక్యము ద్వారా తెలిసికొన వలసిన దేమనగా, మునుపటికంటే ఇప్పుడు శత్రువు ఎంతో చురుకుగా నుండి, విశ్వాసులను తప్పు బోధలు, సిద్ధాంతముల ద్వారా, మోసగాండ్రయిన పనివారిద్వారా హింసలు, బాధలు, పేదరికము, మరియు అంతఃకలహము ద్వారా అనేక విధములుగా ఎదిరించును. కనుక దేవుని ప్రజలను సరియైన విధానములో బోధించుట ద్వారా కాపాడని యెడల ఆయన మనకిచ్చిన బాధ్యతలో తప్పిపోయిన వారమగుదుము.
పౌలు అపొస్తలుడు మాత్రమే గాక, ప్రవక్త, సువార్తికుడు, కాపరి అయినప్పటికిని అతనికి అనేకమంది సేవకుల సహాయము కావలసియుండెను. ఈ దినములయందు కొందరు బోధకులు తమకు అన్ని తలాంతులు ఉన్నవనియు, తమంతట తామే సమస్తము చేయగలమనియు భావించెదరు. ప్రతిఫలంగా దేవుని ప్రజలను భద్రపరచుటలో తప్పిపోయెదరు. వారు తమ హద్దుబాటులను గుర్తించి, ఆయా తలాంతులు గలిగిన యితరులను ఆహ్వానించిన యెడల సంఘము బలపరచబడి, భద్రపరచబడగలదు.
నీవు దేవుని ఆత్మీయ మందిర నిర్మాణము యొక్క నమూనాను అర్ధము చేసికొనని యెడల ఆ పనిని ఆటంక పరచకుండా నీవు జాగ్రత్త పడుము. దేవుడు తన పరిచర్య నిమిత్తమై నిన్ను పిలువని యెడల నీవు దేనిని కార్యముల యందు జోక్యము చేసికొనకుండవలెను. ఆయన పరలోక ప్రణాళికకు విరోధమైన ఏ పనినైనను ఆయన అంగీకరించడు.
No Comment to " September 7 "