నేను జీవించువాడను... గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను - ప్రకటన 1:18
పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ ఎంతో ముఖ్యమైన అంశము. క్రొత్త నిబంధనలో 250 అధ్యాయములలో 360 వచనములు ఈ అంశమును గూర్చినవే మరియు 28 అధ్యాయములు కేవలము రెండవ రాకడను గూర్చినవే. ఈ అంశము ఎంతో వివరముగా వ్రాయబడినది. పదే పదే ఈ అంశమును గురించి వివరించుటలో దేవుని ఉద్దేశము కలదు. ఎన్నోసార్లు ప్రకటన 1వ అధ్యాయములో "సమయము సమీపించినది" అని చెప్పబడినది (ప్రకటన 1:3). "ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చు చున్నాడు, అవును ఆమెన్" (7వ వచనము). "నేను ఆల్ఫా, ఒమేగా, ఆదియు, అంతమునై యున్నాను.. సర్వ శక్తి గలవాడను” (8వ వచనము).
ప్రకటన గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశము మనలను క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుట కొరకే. మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి యున్న యెడల అనేక అపాయములు, అపవిత్రత, మోసముల నుండి తప్పించబడగలము. అనేక మంది ఈ అంశమును గూర్చి అనేక సిద్ధాంతములు మరియు బోధలను గూర్చినదేనని తలంచుటను బట్టి నిజముగా సత్యమును గ్రహించక ఎటువంటి ఆనందమును పొందరు. ఈ అంశము నీవు బహుమానము పొందుటకు పరీక్షలో ఉత్తీర్ణుడవగుట వంటిది కాదు! ఇది నీకు సమృద్ధియైన ఆనందము నిచ్చును, ఇదే విజయవంతమైన జీవితమునకు రహస్యము. ఇది అపొస్తలుడైన యోహానుకు ఎంతో నిరాశ, నిరుత్సాహ పరిస్థితిలో నున్నప్పుడు దర్శనరీతిగా తెలుపపడెను. మనమందరము కూడా నిరాశ లేక నిస్పృహలకు గురియగుదుము. మన చుట్టునున్న పరిస్థితులు ఎల్లప్పుడూ మనలను నిరాశపరచును.
అపొస్తలుడైన యోహాను యేసు ప్రభువు యొక్క ప్రియమైన శిష్యుడు. ఈ విషయము యోహాను సువార్తలో ఆరు సార్లు వ్రాయబడెను. ఈ శిష్యుడు దేవుని వాక్యము నిమిత్తమును, యేసు క్రీస్తు విషయమైన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపములో చెరసాల యందు బంధించబడెను. ఇది శిష్యుల గ్రాహ్యమునకు మించినదిగా ఉండెను. అంత్యదినములందు ఈలాగుననే జరుగును. ప్రకటన 12వ అధ్యాయములో వ్రాయబడినట్లు శత్రువు ఉగ్రుడై దేవుని ప్రజల మీద దాడి చేయును. ఆయన త్వరగా వచ్చుచున్నాడు అను జ్ఞానమును గూర్చిన గ్రహింపు ద్వారానే మనము జయమొందగలము. దేవుడు యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఎంతో నిరాశలో ఉండెను. ప్రభువు త్వరలో తిరిగిరానై యున్నాడని గుర్తు చేయబడినప్పుడు ఇంతకు ముందు అర్ధముగాని విషయమును ఆ దినమే గ్రహించ గలిగెను..
మనము సహనమును కోల్పోవలసిన అవసరతలేదు. మనము ఓపికతో కనిపెట్టిన యెడల ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు మన ప్రతి ప్రశ్నకు జవాబు పొందెదము. ఆదినమున రక్షణ కార్యము సంపూర్ణము చేయబడి, రక్షణ యొక్క గొప్పతనమును గుర్తించి, రక్షకుని యొక్క గొప్పతనమును ఎరిగెదము. ఆ దినము కొరకు మనము సిద్ధపడుట మనకు ఎంతో వింతైన సంతోషానందమును కలిగించును.
No Comment to " September 6 "