Wel-Come to Our Blogger

Freely you have Recieved, Freely Give - Matthew 10:8

The prayer of the upright is His delight. - Proverbs 15:8 | యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. - సామెతలు 15:8

కీర్తన 18:19

By G Sunil Kumar - Monday, 11 August 2014 No Comments
విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను - కీర్తన 18:19

తన బాల్యము నుండి యోసేపు సంపూర్ణముగా దేవునిపై ఆనుకొనుటకు నేర్చుకొనెను. అతని బంధులువు విడచిపెట్టిరి, అతని స్నేహితులు అతనిని మరచిపోయిరి. ఏ ఒక్కరును సహాయము చేయుటకు గాని, దయచూపుటకు గాని లేని సమయములు గలవు. ప్రోత్సాహపరచుటకు, ఆదరించుటకు గాని ఎప్పుడును ఎవరి దగ్గరనుండి ఏ ఉత్తరమును అందుకొనలేదు. ఆ దినములలో దేవుడు తనకు ఎంతో విలువైనవాడుగా అయి ఉండవచ్చునని, ఎక్కువ సమయము ప్రార్ధనలో దేవునితో సంభాషించుచు గడిపి ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను. ఈ విధముగా ఒక దినమున పొందబోవు ఉన్నతమైన స్థానము కొరకు దేవుడు యోసేపునకు శిక్షణ ఇచ్చెను.

దేవుడు యోసేపుకు కుమారుని ఇచ్చి ఆశీర్వదించినప్పుడు దేవుడు తనను మరచి పోలేదనియు, విడచిపెట్టలేదనియు, ఎల్లప్పుడును ప్రేమించుచున్నాడనియు మరియు ఆయన తన కొరకు చేయుచున్నదంతయు అర్ధము చేసికొని వానికి "మనష్షే” అని పేరు పెట్టెను. దేవుడు, మనము కూడా తన హృదయమునకు సమీపముగా ఉండవలెనని కోరుచున్నారు. ఈ లోకములోనే గాక, రానై యున్న రాజ్యములో కూడా మనము ఉన్నతమైన స్థానమును పొందవలెనని కష్టముల ద్వార తీసికొనివెళ్ళి మనలను సిద్ధపరచుచున్నాడు. ఈ కష్టములు ఎంత బాధాకరమైనవైనప్పటికిని వాటి నిమిత్తము దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞత చెల్లించవలెను. నీవు ఈ శ్రమల ద్వారాల వెళ్ళని యెడల నీవు ఒక సాధారణ జీవితమును మాత్రమే కలిగి యుందువు. కానీ దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థానములో నీవు ఉండగోరిన యెడల, తప్పక అగ్నివంటి శ్రమల ద్వారా వెళ్ళుటకు నిన్ను నీవు సిద్ధపరచుకొనవలెను.

ప్రతి విశ్వాసి ఇటువంటి శ్రమల ద్వారా వెళ్ళవలసినదే, లేఖనములలో మనము చదువుచున్న దేవుని భక్తులందరును భయంకరమైన శ్రమల ద్వారా వెళ్లి యున్నారు. దావీదు ఎన్నో శ్రమల ద్వారా వెళ్లినవాడై ఈలాగున చెప్పుచున్నాడు, "విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చెను" (కీర్తన 18:19), 2 కొరింతి 11:30 లో అపొస్తలుడైన పౌలు వెళ్లిన నలుబది కంటే ఎక్కువ శ్రమల పట్టీని చూచుదుము. కనుక రానైయున్న దినములలో దేవుడు మనకు గొప్ప బాధ్యతలను అప్పగించుటకు ఈ విధమైన శిక్షణను, సిద్ధపాటును కలిగియుండు ఆధిక్యతను మనకిచ్చినందులకు ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్ధులమై యున్నాము.

Tags:

No Comment to " కీర్తన 18:19 "