సహోదర ప్రేమను నిలువరముగా ఉండనియ్యుడి - హెబ్రీ. 13:1
దేవుని ఇంటి నిర్మాణములో ఎటువంటి భాగమును తీసికొనవలెనో అనేకులు ఎరుగరు. ఆదివారము ఏదో ఒక ప్రార్ధనా స్థలమునకు వెళ్లి, ఏదో ఒక వర్తమానము వినిన చాలునని తలంచుదురు. మనము అనుభవము ద్వారా మరియు దేవునిపై ఆధారపడటం ద్వారా దేవుని ఇంటి నిర్మాణములో మన భాగమును తెలిసికొనగలము. ఇది నేర్చుకొనుటకు చాల సంవత్సరములు పట్టవచ్చును, గాని తప్పకుండా మనము నేర్చుకొనవలసినదే.
ప్రభువు, గృహమును కట్టుచున్నప్పుడు మనము ఆయన జతపని వారము మరియు భాగస్వాములము. మన ప్రేమ, సాక్ష్యము, మరియు సమర్పణల ద్వారా ఆయన మనకు అనేక మంది ఆత్మీయ పిల్లలను అనుగ్రహించును (కీర్తన 127:4). మన ఆత్మీయ పిల్లలు కూడా దేవుని యందు ఎదుగుచు, ఆయనతో నడచునప్పుడు మన సంతోషానందములు మరియు బలము అధికమగును. అపొస్తలుడైన పౌలు దెస్సలొనీకలోని విశ్వాసులకు "మీరే నా మహిమ' అని వ్రాసెను. వారి మధ్యలో నున్నప్పుడు అతడు ఎన్ని శ్రమలకు గురిఅయ్యేనో అవన్నియు మరచిపోయెను. దేవుని ఇంటి నిర్మాణములో మన భాగమును ఆత్మలను సంపాదించుట ద్వారా అనగా "సజీవ రాళ్లను" యేసు క్రీస్తు ప్రభువు యొక్క పోషణలో ఎదిగింప చేయుచున్నప్పుడు కీర్తన 127: 4,5 ప్రకారము మన విషయములో కూడా అది నిజమగును. కొన్ని సార్లు వర్తమానముల ద్వారానే గాక సాక్ష్యముల ద్వారా లేక దయచూపించు కార్యముల ద్వారా కూడా ఆత్మల రక్షణ జరుగును.
నా కళాశాల స్నేహితుకొకడు నాతో పాటు టొరంటోలో కలిసి వుండెడివాడు. అతని పేరు మిస్టర్ గ్రీన్. నేను అతని రక్షణ కొరకు ప్రార్ధించెడి వాడను. ఒక ఉదయమున నేను మిస్టర్ గ్రీన్ నీవు రక్షింపబడితివా? అని అడిగినప్పుడు అతడు అవును రెండువారముల క్రిందటే రక్షణ పొందితినని చెప్పెను. ఎంతో సంతోషముతో ఏ విధముగా పొందితివని అడిగినప్పుడు సామాన్యమైన మాటలతో అతడు ఈ విధముగా జవాబిచ్చెను. "మీరు నాకు షేవింగ్ గ్రీన్ మరియు సబ్బు ఇచ్చిన దినముననే నేను రక్షణ పొందితిని". నేను నా స్నేహితునికి సబ్బు లేకుండా గడ్డము గీసికొనుప్పుడు ఎట్లు అతనికి గాయమైనదో చూచి నా క్రీమ్ మరియు సబ్బు ఇచ్చితిని. ఆ మంచి క్రియ ద్వారా మిస్టర్ గ్రీన్ రక్షణ పొందెను. అది చిన్న విషయమే గాని, అద్భుతమైన రక్షకుని గూర్చి నేను చెప్పినది నిజమని అతడు గ్రహించెను. మనము ఎవరినైను బాధలో లేక వేదనలో ఆదరించినప్పుడో లేక దర్శించి నప్పుడో ప్రభువు మన ద్వారా తన గృహమును కట్టును.
No Comment to " September 1 "