నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి - యిర్మీయా 15:16
పరిశుద్ధ గ్రంధము దేవుని వాక్యము, అందు మన ఆశీర్వాదము కొరకు జీవపు మాటలు గలవు. అది మనకు జ్ఞానమును, వివేచనను అనుగ్రహించును. పరిశుద్ధాత్మ మనకు బైబిలును వివరించును. కానీ కొంతమంది మాత్రమే బైబిలును చదువుటకు ఇష్టపడెదరు.
పరిశుద్ధ గ్రంధమును చదువుటకు మూడు విధానములు కలవు. ఒకటి విద్యావేత్త వలె, మరొకటి సీతాకోకచిలుక వలె, మూడవది తేనెటీగ వలె చదువుట. విద్యావేత్త బైబిలును చదువునప్పుడు విశ్రాంతి తీసికొను కుర్చీలో కూర్చొని, తలగడ వెనుక పెట్టుకొని, కాఫీ త్రాగుచు, బైబిలును చదువును. ఇటువంటివారు ఎంతో సమాచారమును పొందుదురు గాని వారి జీవితములలో ఎటువంటి మార్పు ఉండదు. వారు ఈ విధముగా తలంచుదురు. నన్ను గనుక హెబ్రోనులో వర్తమాన మివ్వమని అడిగిన యెడల ఎంతో మంచి వర్తమాన మివ్వగలను. దానిని నా భార్య ఎంతగానో మెచ్చుకొనగలదు. రెండవ తెగవారు బైబిలును సీతాకోక చిలుక వలె చదువుదురు. అనగా ఒక పుష్పమునుండి, మరొక పుష్పమునకు, ఒక తోట నుండి మరొక తోటకు ఎగురునట్లు, కొందరు తమ కిష్టమైన పుస్తకములను లేక అధ్యాయములను, కీర్తనలు 23 గాని, యెషయా 53 గాని, మత్తయి 5 వ అధ్యాయము గాని మొదలు పెట్టి ఇంకొక ఇష్టమైన భాగము చదివెదరు. మరికొందరైతే తేనెటీగ వలె బైబిలు చదువుదురు. తేనెటీగలు తేనెకొరకు పువ్వునుండి, పువ్వునకు తిరుగుచు తేనెపట్టు చేరును. అలాగే అన్ని తేనెటీగలు తేనెపట్టులో తేనెను చేర్చును. అపుడు రాణి ఈగ ఆజ్ఞానుసారం అన్ని తేనెటీగలు కలిసి భుజించి, ఆనందించును. దేవుని వాక్యమునందు వారు నిజముగా ఆనందించునట్లు వివేచనతోను, విశ్వాసముతోను కలిసి పనిచేయుదురు. ఏ విధముగా తేనెటీగ పుష్పమునుండి, పుష్పమునకు వెళ్లి తేనెను సమకూర్చునో మనము కూడా బైబిలును జాగ్రత్తగా ప్రార్ధన పూర్వకముగా చదువవలెను. సహ విశ్వాసులతో సహవాసమందు కలిసివచ్చుట ద్వారా మనము కూడా దేవుని వాక్యమును భుజించునట్లు ఆనందించెదము. క్రైస్తవ సహవాసమును నీవు ఇంకను రుచించని యెడల దేవుని వాక్యమునందు కూడా రుచి కలిగియుండలేవు. ఈ రెండును కలిసి వెళ్ళును
No Comment to " September 2 "